గౌరవం అనేది గుణాన్ని చూసి ఇస్తారు , ధనాన్ని చూసి కాదు
నా జీవితం గొప్పది అని ఎప్పుడు గర్వపడకు
మనిషి జీవితంలో అదృష్టం అనేది ఎంత కాలం ఉంటుందో చెప్పలేము
కానీ జీవితంలో ఎదో ఒక రోజు చావాలా బతకాల అనే పరిస్తితి మాత్రం ఖచ్చితంగ వస్తుంది
ఆరోజున నువ్వు పడిన కష్టాలు నీకు జీవితాంతం గుర్తు ఉండిపొయోలా చేస్తాయి జాగ్రత్త
డబ్బిచ్చి చూడు తీసుకున్నవాళ్ళు పువ్వులతో పూజిస్తారు
అలాగే ఇచ్చిన డబ్బును అడిగి చూడు నీ పైన దుమ్మెతి పోస్తారు ఇదే కదా డబ్బు మహిమ
మన దగ్గర ఎంత డబ్బెనా ఉండొచ్చు కానీ అవతల వాళ్ళని చులకనగా చూసే జబ్బు మాత్రం ఉండకూడదు
మనం పుట్టేదే మరణించడానికి
నరనరనా స్వార్థన్ని నింపు కుంటున్నావు
నరరుాప రక్షసుడిలా తయారవుతున్నావు..
బంధం బంధాలని వద్దు అనుకుంటున్నావు బరితెగించి
అందమైన జీవితాన్ని ఆగం చేసుకుంటున్నారు
సమాజం నీకిచ్చే విలువ ఏంటో తెలుసుకో..
సముద్రంలో పడవ ప్రయాణం లాంటిది మనిషి జీవితం అని మర్చిపోకు.
ప్రాణం కోసం ఎంత ఆరాట పడుతున్నావో ఎన్ని అడ్డ దారుల్లో వేలుతున్నావో ఆలోచించు..
చింపేస్తే చినిగిపోయే చిచ్చుకాగితంలాంటిది ప్రాణం కాని బ్రతికి ఉన్నన్ని రోజులు మనం పంచిన ప్రేమ ఇచ్చే మర్యాద తీసుకున్న గౌరవం ప్రజల గుండెల్లో నిలిచిపోయే మంచితనం మరణించిన తరువాత కుాడా సజీవంలా బ్రతికే ఉంటాయి. కావున
మనలో ఉన్న స్వార్థాన్ని ఈర్షను కోపాన్ని చెడు గుణాన్ని పిసినారి తనాన్ని పిరికితనాన్ని
బానిసత్వాన్ని వదిలేయ్
అందరితో ఆనందంగా జీవించు.
ఈ సమాజాన్ని మంచి మనసుతో ప్రేమించు..!