బిచ్చగాడు అడుక్కునేటప్పుడు‘దానం చెయ్యండి’ అనే బదులు“ధర్మం చెయ్యండి” అని ఎందుకు అడుగుతాడు? ఆలోచించండి.? పూర్వకాలపు భారతీయ ధర్మం ఏమిటంటే: సంపాదించిన దాన్ని నాలుగు భాగాలు చెయ్యాలి.మొదటి రెండు భాగాలు స్వంతానికి.మూడోభాగం పన్నులు, తదితరాలు.నాలుగో భాగం పేదలు, కళాకారులు, గురువులు, పురోహితులు, సన్యాసులుఇలాంటి వారికి ఇవ్వాలి. ఇది మన కనీస ధర్మం.దీనికి సంస్కారం అవసరం. వాళ్ళు అడుక్కోవాల్సిన అవసరం లేదు.దీన్ని ధర్మం పాటించడం అంటారు,మన ధర్మం మనకి రక్ష లేదంటే మన అహంకారానికి మనమే బలికాకతప్పదు. దాన గుణంContinue reading “గొప్ప_సందేశం”
Author Archives: Adlasushma
ఋణనుబంధం
తెలిసి తెలియక చేసే తప్పులు కూడా బంధాలు అవుతాయి..ఇతరులతో పూర్వజన్మలో మనకు గల ఋణాను బంధాలు తీర్చుకోవడానికే ఈ జన్మలో భార్యగా, భర్తగా, సంతానంగా, తల్లిదండ్రులుగా, మిత్రులుగా, నౌకర్లుగా, ఆవులు, గేదెలు, కుక్కలు ఇలా ఏదో ఒక రకమైన సంబంధంతో మనకి తారస పడుతుంటారు. ఆ ఇచ్చిపుచ్చుకునే ఋణాలు తీరగానే దూరమవడమో,మరణించడమో జరుగుతుంది. ఈ విషయాన్ని మనం చక్కగా అర్థం చేసుకో గలిగితే మన జీవితకాలంలో మనకి ఏర్పడే సంబంధాల మీద మోజు కలుగదు.ఇతర జీవులతో మనContinue reading “ఋణనుబంధం”
కనువిప్పు కలిగించే కథ
ఒక వ్యక్తి ఎప్పుడూ అలవాటుగా సాయంకాలం నడక కోసం ఒక అడవి పక్కగా నడుస్తూ ఉండేవాడు. ఒక సాయంత్రం, అడవిలోనికి నడుద్దామని నిశ్చయించుకున్నాడు . అతను ఒక రెండు మైళ్ళు నడిచిన తరువాత, సూర్యాస్తమవటం ప్రారంభమై వెలుగు తగ్గటం మొదలయింది, అంచేత, అడవి నుండి బయటపడటానికి తిరుగు ప్రయాణమయ్యాడు. కానీ అతనికి భీతావహంగా ఆవల పక్కకి జంతువుల గుంపు చేరింది. ఆ క్రూర మృగాలు అతన్ని తరమటం మొదలుపెట్టాయి, వాటి నుండి తప్పించుకోవటానికి అతను ఇంకా అడవిContinue reading “కనువిప్పు కలిగించే కథ”
గుప్పెడు మనసు
చినుకు రాలితే చిగురించిన ఆకుల్లామనసు తడికి హృదయమెుకటి కొత్తగా మెులుస్తుంటుందిఆవేదనొచ్చినపుడల్లా అత్తిపత్తిలాముడుచుకుపోతుంటుందిమౌనంతోనే అనుక్షణం సంగమిస్తూనిరంతరం తలపులతో పురుడు పోసుకుంటూనే ఉంటుందిపేరుకు గుప్పెడు మాంసపు ముద్దైనాఅంతులేని కలలు ..కల్లలైన ఆ కలల కోసం కళ్ళలో జలపాతాలు ..కొన్నిసార్లు ఎగిసి ఎగిసిపడుతున్న ఆశల కెరటాలను మోస్తూతీరం చేరని అలల ఆశయాల కోసంఆ గుప్పెడే సాగరమంతవుతుంటుందికొన్ని ఆటుపోట్లు కుదించివేస్తుంటేకొన్ని మౌనాలు కలిచివేస్తుంటేనాకు నేనే అంతుపట్టనంతశూన్యమవుతుంటుంది
దుర్గ దేవి స్త్రోత్రం
సర్వస్వరూపే సర్వేశేసర్వ శక్తి సమాన్వితేభయేభ్యస్త్రాహినోదేవిదుర్గేదేవి నమోస్తుతే…